'మహర్షి' నుంచి ' ఇదే కదా, ఇదే కదా నీ కథ' సాంగ్

04-05-2019 Sat 10:22 | Entertainment
  • 'మహర్షి' ఆశయ సాధనను ఆవిష్కరించే సాంగ్
  •  సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  •  ఈ నెల 9వ తేదీన భారీ విడుదల
మహేశ్ బాబు అభిమానులంతా ఈ నెల 9వ తేదీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ రోజునే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఒక్కో లిరికల్ వీడియో సాంగ్ ను వదులుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు.

"ఇదే కదా ఇదే కదా నీ కథ .. ముగింపులేనిదై సదా సాగదా .. " అంటూ ఈ పాట సాగుతోంది. కథానాయకుడి ఆలోచన .. ఆశయాన్ని ప్రతిబింబిస్తూ ఈ పాట నడుస్తోంది. దేవిశ్రీ సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. విజయ్ ప్రకాశ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. బిజినెస్ మేన్ నుంచి రైతుగా .. విదేశాల నుంచి పల్లెటూరి దిశగా కథానాయకుడి అడుగులు పడే క్రమంలో ఈ పాట తెరపై ఆవిష్కరించబడుతుందని అనిపిస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీగా పూజా హెగ్డే కనిపించనున్న సంగతి తెలిసిందే.
Mahesh Babupooja hegde

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more